స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో fun ఎంతో fun నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో fun ఎంతో fun కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత ఒంపినట్టుగా ఎంతో fun ఎంతో fun కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోనీ మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని రాతిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం ఉదయమంటే తియ్యనైన ముద్దు మేలుకొలుపని దొంగలాగ నిద్రపోవడం ఎంతో fun ఎంతో fun రోజుకొక్క బొట్టు బిళ్లే లెక్కపెడుతూ చిలిపి అద్దం కొంటె నవ్వే నవ్వుతోంది బైటికెళ్లే వేళ నువ్వే పిలిచి ఇచ్చే వలపు ముద్దే ఆయువేదో పెంచుతోంది ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లెపూల పరిమళం మత్తు జల్లి గుర్తు చేయడం ఇంటి బైట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో fun ఎంతో fun