పరుగు తీస్తున్న పరువమా, పరిమళిస్తున్న మరువమా
తలపు లోతుల్లో తియ్యని గాయమా
అతనితో చూపు కలుపుమా, సూటిగా మాట తెలుపుమా
బయటపడలేని తికమక న్యాయమా
ఇదే తంతు కొన్నాళ్ళుగా నీలో
ఆలోచిస్తూ ఎన్నాళ్ళు ఊహల్లో
ఎదలో స్వరమా, పలుకే బంగారమా
తనలో సగమా, అయినా మోమాటమా
తొనకిసలయే తొలి పదనిస, తనలో తనే నలుగుతోంది
గుస గుస గుస పరవశమయే పాటగా
తొలకరి నశా తెలియక దిశ, అటు ఇటు ఎటో తిరుగుతోంది
కలవరమయే తెరమరుగునే దాటగా
కులాసాగా ఈ హాయి బావున్నా
ఫలానాగా మౌనాలు వీడేనా
ఎదలో స్వరమా, పలుకే బంగారమా
తనలో సగమా, అయినా మోమాటమా
Поcмотреть все песни артиста
Other albums by the artist