Kishore Kumar Hits

Ghibran - Enno Ratrulosthayi Remix Song lyrics

Artist: Ghibran

album: Amigos


ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ

ఎన్ని మోహాలు మోసి
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే
ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా
ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే
ఓహోహో
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ

గట్టి ఒత్తిళ్ల కోసం
గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే
ఓహోహో
నీ గోటి గిచ్చుళ్ల కోసం
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే
ఓహోహో
అంతే ఎరుగని అమరిక
ఎంతో మధురమీ బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే బరువిక
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఓహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists