Ezra Sastry - Siluve Naa Saranaayenuraa lyrics
Artist:
Ezra Sastry
album: Andhra Christian Hymns
సిలువే నా శరణాయెను రా
నీ సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ సిలువే నా శరణాయెను రా
♪
సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు
సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ సిలువే నా శరణాయెను రా
♪
సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు
సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ సిలువే నా శరణాయెను రా
♪
సిలువను దరచి తరచితి విలువకందగరాని నీ కృప
సిలువను దరచి తరచితి విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ సిలువే నా శరణాయెను రా
♪
పలు విధ పథములరసి ఫలితమేమి గానలేక
పలు విధ పథములరసి ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ సిలువే నా శరణాయెను రా
♪
శరణు యేసు శరణు శరణు
శరణు శరణు నా ప్రభువా
శరణు యేసు శరణు శరణు
శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ సిలువే నా శరణాయెను రా
Поcмотреть все песни артиста
Other albums by the artist