Chennai Sisters - Thirumala Mandira Sundara lyrics
Artist:
Chennai Sisters
album: Namo Venkatesa
తిరుమల మందిర సుందర
సుమధుర కరుణా సాగర
ఏ పేరున నిను పిలిచేనురా
ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందర
సుమధుర కరుణా సాగర
ఏ పేరున నిను పిలిచేనురా
ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందర
సుమధుర కరుణా సాగర
పాలకడలిలో శేష శయ్యపై పవళించిన శ్రీపతివో
పాలకడలిలో శేష శయ్యపై పవళించిన శ్రీపతివో
వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో
ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆది శక్తివో
తిరుమల మందిర సుందర
సుమధుర కరుణా సాగర
కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును ఘడియైనా
కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును ఘడియైనా
నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలొక రేయైనా
నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును క్షణమైనా
తిరుమల మందిర సుందర
సుమధుర కరుణా సాగర
ఏ పేరున నిను పిలిచేనురా
ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందర
సుమధుర కరుణా సాగర
Поcмотреть все песни артиста
Other albums by the artist