Kishore Kumar Hits

Punam - Booloka Swargama lyrics

Artist: Punam

album: Chakri


భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చా
పోలేక ఉండలేక కంటినీరై నిలిచావా
ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటివచ్చావా
అడుగడుగున బాధలతోటి
బ్రతుకే పోటీ ఇచ్చావా
కన్న తల్లి చేతి ముద్ద నెలపాలే చేశావా
అమ్మ కన్న మిన్న లేదు
అన్న మాటే మరిచావా

చదువులకే చదువై నిలిచి
అమ్మ కంటి వెలుగై నిలిచి
Pound-uల్లో power-e చూసి
Londonన్ని loveఎ చేసి
కన్నోళ్ళ తోడే విడిచి
కని పెంచిన ఊరే విడిచి
नेसताల స్నేహం విడిచి
నీ మట్టికి దూరం నడిచి
పై చదువుల కోసం నువ్వు
పయనం అయ్యి వచ్చావా
నీ మేధకు సమాధి కట్టే
మోసానికి బలి అయ్యావా
ప్రాణమల్లే వున్న చదువుని
Part time లా మర్చావా
బాధల్లో ఉన్నాగాని బాగున్నానని అన్నవా

అవకాశాలెన్నోవున్నా నీకోసం చుస్తూ వున్నా
అందనిదే గొప్పని నమ్మి
ఆస్తి పాస్తులన్ని అమ్మి
ఊహల్లో మేడలు కట్టి
Foreign లో అడుగే పెట్టి
పరువంత పక్కన పెట్టి
కూలీల వేషం కట్టి
అవమానాలెన్నో మోస్తూ
అన్ని చేస్తూ ఉన్నావా
జీవితమే జీతం తోటి తూకం వేస్తూ ఉన్నావా
ఎండమావి నీళ్ల కోసం ఎడారిలోన వేతికావా
ముళ్ల దారిలోన నువ్వు గామయ్యి నిలిచావా

రక్తాన్నే పంచిన తల్లి రాఖిని కట్టిన చెల్లి
నువ్వు ఆడి పాడిన గల్లి
చూస్తున్నది నీకై మళ్లీ
ఎదిగొచ్చిన బిడ్డల కోసం
ఎద నిచ్చే ఆప్తుల కోసం
గూడొదిలిన గువ్వల కోసం
గుర్తొచ్చే నవ్వుల కోసం
చూస్తున్నది గగనం నిండా
ఎగిరే జండా రమ్మంటూ
వీస్తున్నది దేశపు గాలి
జెండా ఊంచా అనమంటూ
ఓ సచిను కలాం కూడా
Foreign pound దిక్కనుకుంటే
ఈ ఎత్తుకు ఎదిగేవారా
దేశం క్యాతిని పెంచేవారా
నిజం తెలుసుకో వందే మాతరం
వందే మాతరం నీ రుణం తీర్చుకో
భారతీయుడై భువిని గెలుచుకో
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists