Mahesh Shankar - Super Model lyrics
Artist:
Mahesh Shankar
album: Vennela
సూపర్ మోడల్ లాంటి పిల్ల ఒకవచ్చె గుండె గుచ్చె
నా చూపులు కదిపి ఊహలు చెడగొట్టిపోయే కొట్టిపోయే
కన్నులలో కనులిచ్చి వచ్చిందో కలత రేపి కలలెక్కి పోయిందో
నెమలీకలా అడుగేసి వచ్చిందో మల్లికలా విరుగాలి వీచిందో
♪
సూపర్ మోడల్ లాంటి పిల్లోడిటు వచ్చే గుండె గుచ్చె
నా ఊహలు కదిపి మనసే కొల్లగొట్టి పోయే కొట్టిపోయే
కన్నులలో కనులిచ్చి వచ్చాడు కలత రేపి కలలెక్కిపోయాడు
మేఘంలా వర్షించి వచ్చాడు మోహం రేపి మరులిచ్చి పోయాడు
♪
మెరుపై వచ్చి మెలకువిచ్చి కవితను నేర్పింది
శ్వాసను చేరి జ్వరమై మారి నరమున కలిసింది
కిన్నెరసాని పున్నమి రాణి రధమున వచ్చింది
కోకిల వాణి నవ్వుల బాణి పదమై వెలిసింది
వెల్లువై తరుముకు వచ్చిందో ఉప్పెనై ఎత్తుకు పోయిందో
దేవతై దర్శనమయిందో వేవేల వరములు ఇచ్చిందో
♪
మాటలు చెప్పి మాయలు చేసి చూపులు దోచాడు
గుండెను మీటి గొంతున పొంగి స్వరముగా మారాడు
మిన్నులు వీడి వెన్నెల రాజు వేటకు వచ్చాడు
కన్నయ్యలాగా కన్నెను చేరి వేణువులూదాడు
వేసవై వేడిగా వచ్చాడు వేకువై వెచ్చగా తాకాడు
నదిలా నురగలు చిందాడు నీడై మారి తోడుగా ఉన్నాడు
సాహిత్యం: రవివర్మ: వెన్నెల: మహేష్ శంకర్: టిప్పు
Поcмотреть все песни артиста
Other albums by the artist