ముసలితాత ముడత ముఖం మురిసిపోయినే (మురిసిపోయినే) గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయేనే (మెరిసిపోయేనే) రచ్చబండా పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా... రంగరంగ సంబరంగ మోగేనే వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ... వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ... కత్తి, సుత్తి, పలుగు, పార తియ్యండి మన కష్టం సుక్కలు కుంకుమబొట్టుగా పెట్టండి (మన కష్టం సుక్కలు కుంకుమబొట్టుగా పెట్టండి) ఓఓఓ... అన్నంబెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి (మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి) అమ్మోరు కన్ను తెరిసిన నవరాతిరి ఇన్నాళ్ల సిమ్మసీకటి తెల్లరే సమయం కుదిరి వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ... ఓ మట్టిగోడలు చెబుతాయి సీమ మనుషుల కష్టాలు హే దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల సిత్రాలు హ్మ్ పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరుగయ్యేది పుట్టిపెరిగిన పల్లె వైపేగా... అస్సలైన పండగ ఎపుడంటే ఆ కన్నా తల్లి కంటినీరు తుడిచిన రోజేగా... ఓనాడు కళ కళ వెలిగిన రాయలోరి సీమిది ఈనాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ... ఏ చేతివృత్తులు నూరారు చేవగలిగిన పనివారు అ చెమటబొట్టు తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరు ఎండ పొద్దుకు వెలిగిపోతారు ఈ అందగాళ్ళు వాన జల్లుకు మెరిసిపోతారు... ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోళ్లు... పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని ఒట్టి జోల పాట పాడకా తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చెయ్యాలంట వచ్చాడయ్యో (సామి) నింగి సుక్కలతో గొడుగెత్తింది (భూమి) ఓ ఓ ఓ ఇచ్చాడయ్యో (సామి) కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ...