Kishore Kumar Hits

Varun Sandesh - Neeli Gagana lyrics

Artist: Varun Sandesh

album: Paddanandi Premalo Mari


నల్లని మబ్బును చూసిన నేలకు
ఝల్లని హృదయం పొంగునుగా
మట్టిని చూసిన మబ్బే కరిగి
వానై నేలను చేరునుగా
ఈ బంధం పురాతనం
సంబంధం సనాతనం

నీల గగన ఘన శ్యామునికి
రఘు రామునికి
నేల కూతురి సీతమ్మకి అల శ్రీరమకి
కళ్యాణ వైభోగమే
శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే

అల్లన విల్లును ఎత్తిన చేయి
పెళ్ళున విల్లును విరిచిన చేయి
ఎల్ల వేళలా విడిపోబోమని
పానిగ్రహణం చేసినవి
రాతిని నాతిని చేసిన పాదం
నీతిని నియతిని తప్పని పాదం
(దనిసాస నీని దాద పాప సగమప)
నాతిచరామి అని ఏడడుగులు తోడూ నీడై నడచది
మమతే మంగళసూత్రమని నూరేళ్ళిది సత్యమని
అగ్నిసాక్షిగా రగిలినది యజ్ఞదీక్షగా మారింది
నీలిమబ్బులో మెరుపు తీగలా
సీత రామయ్య జత చేరినది
కళ్యాణ వైభోగమే
శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే

అతడు ఓరగా చూసిన చూపు
ఆమె నిలువునా ఒక మైమరపు
కొసరు చూపులే ఇద్దరిలోనూ
కోటి ఆశలను రేపినవి
అతని గుండెలో ఆగని దుడుకు
ఆమె వెన్నులో సన్నని వణుకు
రామాయణమే ప్రేమాయణమని
రామచిలుకలే పలికినవవి
అసురుల ఆశలు భంగపడే
అహమే తడబడి కిందపడే
స్వయంవరమే వరమయ్యింది
నభం శుభం అని పలికింది
ఎండా వానలో ఇంద్రధనసులా
సీతా రామయ్య జత చేరినది
కళ్యాణ వైభోగమే
శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే
(కళ్యాణ వైభోగమే)
(శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే)

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists