Siddiq Ansari - Edo Inkedo lyrics
Artist:
Siddiq Ansari
album: Edo Inkedo
ఏదో, ఇంకేదో
జరిగే వీలే కలిగిందో
తెలిసిందో తెలియందో
సరికొత్తగా తగిలిందో
ఏంటో, ఏం వింతో
చెప్పక చేరువ అయ్యిందో
పులకింతో, గిలిగింతో
కనిపెట్టగ దొరకందో
బహుశా కలవరించాననా
భ్రమలో కలిసి నడిచాననా
అసలిక తెలుసుకున్నాను
నా నువ్వనీ...
మనసున పోల్చుకున్నాననా
జతగా కోరుకున్నాననా
ఆశగా అందుకున్నాను
నిన్నే రమ్మనీ...
నాలో నాకేదో
కొత్తగ రేపే ఆశేదో
లోలో తాకిందే
నను వింతగ తోచిందే
నాలో నా కలలో
తడువుగ తరిమే చెలిమేదో
నాతో నిలుచుందే
కనికట్టుగ వలచిందే
గాలై తిరిగా, వానై కురిసా
నీతో సందడికై
చిరు నగవే విరిసి పెదవే పలికే
నీతో ఒరవడికై
సరసకు రావే చెలి
సొమ్మేంపోదే మరి
త్వరపడు నువ్వే మరి
పొదుపరీ...
వినవే నా అల్లరి
మార్చవే నీ వైఖరీ
సొంతంకావే మరి
సొగసరి...
జగమే మరచి
జతగా కలసి
నిలిచి పోవాలి
నిన్నే వలచి
ఏదో, ఇంకేదో
జరిగే వీలే కలిగిందో
తెలిసిందో, తెలియందో
సరికొత్తగ తగిలిందో
ఏంటో, ఏమైందో
చెప్పక చేరువ అయ్యిందో
పులకింతో, గిలిగింతో
కనిపెట్టగ దొరకందో
మాయమవ్వకే
మరుగున ఉంచి వెళ్ళకే
సొగసుగ సోయగాన్ని
చూపకుండ దాచకే
జారిపోక,ఊరుకోకఉండవే
తపనలు తీరునెప్పుడో
త్వరపడి నన్ను చేరుకో
చేతిలో గీతవై
రాత మార్చిపో
మైనా ఏమైనా
వదులుగ నిన్నే వదిలేనా
లేనా నే సరిపోనా
సరిజోడి ఇకపైన
రానా, ఏమన్నా
చేతిలో చెయ్యే వేసెయ్ నా
చావైనా బ్రతుకైనా
నీతో అనుకోనా
సమయమే మించిపోలేదుగా
ప్రేమను పెంచుకోవాలిగా
ఊహను పంచుకోవాలిగా
చేరుకో...
చదునుగ హత్తుకోవాలిగా
అదునుగ గిల్లుకోవాలిగా
మృదువుగా వాలిపోవాలిగా
అల్లుకో...
Поcмотреть все песни артиста
Other albums by the artist