ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే చూసే కళ్ళలోన మౌనమే ఓ గానమాయే ♪ ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే చూసే కళ్ళలోన మౌనమే ఓ గానమాయే ఈ వేడుకా నీదా మనసా తేలేదెలా నీ వరసా ♪ ఈ మాయేమిటో తరిమే హాయేమిటో నాతో నేనిలా జరిపే పోరేమిటో ఈ జోరేమిటో అసలీతీరేమిటో నే నీకేమిటో తెలిపే దారేమిటో నే నీచెంతే ఉన్నా ఎంతో దూరాన ఉన్నా కంచె తెంచలేని తెగువే కరువై ఇన్ని చూస్తూ ఉన్నా నను నే ఆపేస్తూ ఉన్నా గీతే దాటలేని బిడియం బరువై ఈ వేడుకా నీదా మనసా తేలేదెలా నీ వరసా ♪ ఎన్నో రంగులే పెను సందేహాలుగా నా చుట్టూ ఇలా నిలిచేలా అన్నీరేఖలే ఇంకా రూపం లేదుగా కాలం గీసిన చిత్రాలే