నమ్మేలా లేదే కల కాదే మనసే మేఘమాయే కమ్మేసిందేదో ఒక హాయే చినుకే భారమాయే ఇయ్యాలనుంది గాని ఉయ్యాలలూగేటి మేఘమా జాగెందుకే సరాసరి పంపించు చిన్నారి చినుకుని నా పెదవికి కనులతో కలహమా నా మనసుని వదలవే బిడియమా ♪ సీత చూపే రామ బాణం అయినదేమో కదా దారేది లేక నవ్వుతూనే నలుగుతోంది ఎద నా మనసుని కోసే సుతారమా కాసేపైనా ఆగుమా ఓ కాలమా వేళాకోళమా జంటై ఉంటే నేరమా నా పెదవికి కనులతో కలహమా నా మనసుని వదలవే బిడియమా ♪ పల్లెటూరే పర్ణశాలై వెలుగుతోంది ఎలా ♪ గుమ్మాన్ని దాటే ఒలిపిరల్లె తుళ్ళిరాకే ఇలా నా నడకని ఆపే నిధానమా నీదే నాదం నాట్యమా ఓ దూరమా నాతో వైరమా తారాతీరం చేరుమా నా పెదవికి కనులతో కలహమా నా మనసుని వదలవే బిడియమా