రాజావారు రాసినుత్తరం ఊరు దాటి పోతోంది తొంభై ఊళ్ళు తిరిగీ తిరిగీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనగనగనగా రాజు సొగసరి కనుల రాణి ఇనుకోండయ్యా సెబుతా ఇద్దరి గాథ అనగనగనగా రాజు సొగసరి కనుల రాణి ఇనుకోండయ్యా సెబుతా ఇద్దరి గాథ ఎపుడొచ్చిందో గాని, ఎదురొచ్చిందోయ్ రాణి తెగ మెచ్చాడోయ్ రాజు, మనసిచ్చాడు గుండె గదులన్నిటిలోనూ వలపునే కొలువుంచాడు తలుపులేసి తలపులోన తేలినాడు లేడు మరి రాజను వాడు, రాణిమయమైపోయాడు, తనకి తానే గురుతులేడు, అడిగి సూడు రాజావారు, రాణీగారు రేపో మాపో ఒకటౌతారు ఊరూవాడా ఈడూజోడూ బాగుందంటారూ రాజా వేరు, రాణి వేరు సూత్తూ ఉండు జంటౌతారు ఆ రోజంతా ఊరూరంతా హోరెత్తే తీరు ఓహో మా కథకు మెచ్చి ఓ అన్న రూపాయ్ ఓ అక్క రెండు పెద్దాయన పది వారిని, వారి కుటుంబాలని దేవుడు సల్లంగా సూడాల మరి మళ్ళీ కథలోకెళ్తే తీగని లాగక కూసుంటే డొంకని ఎవరట కదిపేది రాజుకి భయమట, ప్రేమని తెలుపుట సేతవదంట లోపట సిటపట ఎద మంట రాణికి అది ఇనబడదంట ఆగని పరుగట, రాదట అలసటలో సలుపంట ఏం వలపంటా కాలం పామై కాటే ఏసెనట ఏది రాణి లేదీ సోట ఊరు దాటేసింది ఏం ఫర్లేదు రాణిగారు కచ్చితంగా తిరిగొత్తారు రాజావారు తన ప్రేమని సెప్తారు, సెప్పి తీరతారంతే రాజావారు, రాణీగారు రేపోమాపో ఒకటౌతారు ఊరూవాడా ఈడూజోడూ బాగుందంటారు రాజా వేరు, రాణి వేరు సూత్తూ ఉండు జంటౌతారు ఆ రోజంతా ఊరూరంతా హోరెత్తే తీరు