అశ్వథ్థామ అశ్వథ్థామ అశ్వథ్థామ అశ్వథ్థామ ♪ అగ్రహో దగ్రుడు అగ్ని వర్ణ నేత్రుడు రౌద్ర మార్తాండుడు ఈ ప్రచండుడు కాల కాల రుద్రుడు ప్రళయ వీర భద్రుడు దుర్మదాంద దైత్యజనులనుపేక్షించడు
అశ్వథ్థామ ♪ అశ్వథ్థామ అశ్వథ్థామ అశ్వథ్థామ అనూహ్యమైన యుక్తికితడు కేంద్ర స్థానం అజేయమైన విద్యుశక్తి వీడి ప్రాణం అచంచలం మనోబలం మహా ధనుర్బాణం సంకల్పమే ప్రకంపనం ప్రభంజనం సదా మానినీమాన సంరక్షణార్ధ సత్య సంగ్రామమే వీడి జన్మ కారణం ♪ చెత్త కొడక, తొత్తు కొడక వావి లేదు, వరస లేదు వయసు అసలే గుర్తురాదు ఆడదైతే చాలు నీకు దించు ఆ చూపు దించు ♪ ఆడదంటే ఎవరు రా ఆదిశక్తి రా ఆ తల్లి కంట పడిన చోట అంతులేని గౌరవంతో వంచు తల వంచు
అశ్వథ్థామ అశ్వథ్థామ అశ్వథ్థామ అశ్వథ్థామ భరించినాడు గుండె లోతు పదును గాయం ధరించినాడు గుంతులో హలాహలం భగ భగ జ్వలించిన దవానలం వీడు స్త్రీ జాతికే లభించిన మహాబలం కల కంటి విలువ తెలియనట్టి దూర్థ దూస్సాహసులకు కచ్చితంగా రాస్తాడు మరణ శాసనం