Kishore Kumar Hits

Sricharan Pakala - Maahi - Telugu lyrics

Artist: Sricharan Pakala

album: Aswathama


మాహి మాహి
చూస్తుంటే నువ్వలా

అందాల బొమ్మలా

చూస్తుంటే నువ్వలా అందాల బొమ్మలా
వేలు పట్టి నడిచినావే మీ అన్నతో ఇలా
కళ్ళలో కాంతితో, గుండెల్లో ఆశతో
సిగ్గుపడుతూ బుట్టబొమ్మై ఎదిగావు ఇంతలో
మా అందరి ఊపిరై పెరిగావే
నీలా అల్లరి ఇక నేనే చెయ్యనా
తధీం ధీంతనక ధీంత ధీంతక పెళ్ళి కొడుకు వెనక
తధీం ధీంతనక ధీంత ధీంతక మహారాణి నడక
తధీం ధీంతనక ధీంత ధీంతక అత్తారింటి దాకా
తధీం ధీంతనక ధీంత ధీంతక అడుగులేడు గనక
మాహి
మాహి

రెండు మనసులే ఒకటయ్యే వేళలో
కలపనా ఈ జంటనే
నాకే తెలియని కల నిజమౌతున్నది
తెలపనా ఈ క్షణమునే
విడి విడిగా మనమున్నా
వీడని నీడను నేనులే
ముసి ముసి నీ నవ్వులకే తోడుగా నేస్తం తానులే
మా ప్రాణమే దూరమై వెళుతున్నా
నువ్వే ప్రాణమై బ్రతికే జత దొరికెనే
తధీం ధీంతనక ధీంత ధీంతక పెళ్ళి కొడుకు వెనక
తధీం ధీంతనక ధీంత ధీంతక మహారాణి నడక
తధీం ధీంతనక ధీంత ధీంతక అత్తారింటి దాకా
తధీం ధీంతనక ధీంత ధీంతక అడుగులేడు గనక

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists