Kishore Kumar Hits

Bheems Ceciroleo - Ooru Palletooru lyrics

Artist: Bheems Ceciroleo

album: Balagam


ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు
ఎప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క
ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావ్
నీ పాసుగాల
కోలో నా పల్లె కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే కోడె లాగల్లే
యాప పుల్లల చేదు నమిలిందే
రామ రామ రామ రామ
తలకు పోసుకుందె నా నేల తల్లే
అలికి పూసుకుందె ముగ్గు సుక్కల్నే
సద్ది మూటల్నే సగ బెట్టుకుందే
బాయి గిరక నా పల్లే
హే తెల్ల తెల్లాని పాలధారలల్ల
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే
జంటగ మోగుత ఉంటయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే
దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోదా పక్కన ఉంటే
కొండంత బలగం ఉన్నట్టురా
సల్లగాలి మోసుకొచ్చెరా
సేను సిల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల
రాలుతున్న పూల చప్పట్లు
గడ్డి మోపులు కాల్వ గట్టులు
సెమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల
ఆ ఊరు పల్లెటూరు దీని తీరే
అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె
ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు
ఆ వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే

ఆలు మగలు ఆడే ఆటలు
అత్త కోడండ్ల కొట్లాటలు
సదిరి సెప్పలేని మగని
తిప్పలే తిప్పలు
రచ్చబండ మీద ఆటలు
చాయబండి కాడ మాటలు
ఒచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే
సంగతే గమ్మతి
తట్ట బుట్టలల్ల కూర తొక్కులు
సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది
సచ్చేదాకా ఉంటది యాది
ఊరు నా ఊరు దీని తీరే
అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె
ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు దీని తీరే
కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు
ఆ వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists