Koti - Chandamama Nuvve Nuvve lyrics
Artist:
Koti
album: Arundhati
చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంతా నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కలే ముత్యాలల్లే మెళ్ళో వేశావే
ఢోలారే ఢోలారే ఢం కోలాటాలాడే క్షణం
ఢోలారే ఢోలారే ఢం ఇల్లంతా బృందావనం
పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం
దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం
♪
ఢోలారే ఢోలారే ఢం కోలాటాలాడే క్షణం
ఢోలారే ఢోలారే ఢం ఇల్లంతా బృందావనం... ఇల్లంతా బృందావనం
♪
(కలికి కలికి చిలక)
(అరె ఉలికి ఉలికి పడక)
(మగని మధన గుళిక అది పడితే ఇక ధినక ధినక)
ఇన్నాళ్ళు వేచింది మా ముంగిలి
ఇలా సందళ్ళే రావాలని
ఇన్నేళ్ళు చూసింది మా మామిడి
ఇలా గుమ్మంలో ఉండాలని
మురిసే ప్రేమల్లో ఉయ్యాలూపంగా
తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా
సిరులే చిందాయి వైభోగంగా
వరించి తరించి వాడే వస్తున్నాడు అడ్డం లెగండోయ్
♪
హే... ఢోలారే ఢోలారే ఢం అరె వారేవా ఏం సోయగం
ఢోలారే ఢోలారే ఢం నువ్వేగా నాలో సగం... ఢోలారే ఢోలారే ఢం
♪
కార్తీకదీపం కాంతుల్లో రూపం శ్రీగౌరివోలే లేదా
శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద
♪
జేజమ్మా జేజమ్మా జేజమ్మా జేజమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా
నా తోటే నాచోరే ఓ సోనియే
నువ్వే పుట్టావే మేరే లియే
నాకంటి పాపల్లే చూస్తానులే
అనే మాటిచ్చుకుంటానులే
మనసే బంగారం అంటారోయ్ అంతా
ఇహ పో నీ పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం నీవెంట
కలలోనైనా నిను విడిపోదంట
ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంతా చూడండోయ్
ఢోలారే ఢోలారే ఢం నా చుట్టూ ఈ సంబరం
ఢోలారే ఢోలారే ఢం ఏ జన్మదో ఈ వరం
ప్రాణంలోనే దాచుకుంటాను పంచేటి ఆప్యాయము
జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము
♪
ఢోలారే ఢోలారే ఢం
ఇల్లంతా బృందావనం... ఇల్లంతా బృందావనం
Поcмотреть все песни артиста
Other albums by the artist