K. V. Mahadevan - Endaka Egirevamma lyrics
Artist:
K. V. Mahadevan
album: Srinivasa Kalyanam
ఎందాక ఎగిరేవమ్మా... గోరింక. గోరింక.
సందె వాలినాక గూటికి చేరుకోక
సందె వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా... గోరింక. గోరింక.
జోడు గువ్వ వాకిలి కాసే... నీడలెక్కి చీకటి మోసే...
పెందలాళే ఇంటికి చేరు, పెత్తనాలు చాలునింక
ఎందాక ఎందాక ఎగిరేవమ్మా... గోరింక. అహ గోరింక.
రాచకర్యమంటూ నువ్వు దేశమేలబోతే
వేగుచుక్క వెక్కిరింతలో కునుకైనా రాదే
మూసుకున్న రెప్పల వెనకే చూసుకోవె నన్ను
పిల్లగాలి గుసగుస నేనై జోల పాడుతాను
ఎందుకులే దోబూచాట తొందరగా రావేమంట
కోరగానే తీరిపోతే కోరిక విలువేమిటంట
ఎందాక ఎందాక ఎగిరేవమ్మా... గోరింక (ఉహు హు). గోరింక (అహ హ).
సందె వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా... గోరింక. అహ గోరింక.
ఊసుపోని ఏకాంతంలో తోసిపోకు నన్ను
తోడులేని కలల బరువుతో ఈడునేగలేను
దారం నీ చేతిని ఉన్న గాలిపటం నేను
దూరం ఎంతైనాగాని నిన్ను వీడిపోను
తీసుకుపో నీతో పాటే కాదంటే నా మీదొట్టే
తీసుకుపో నీతో పాటే కాదంటే నా మీదొట్టే
ఊరించే దూరం ఉంటే అదో కమ్మదనమేనంట
ఎందాక ఎందాక ఎగిరేవమ్మా... గోరింక. అహ గోరింక.
సందె వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా... గోరింక (ఉహు హు). అహ గోరింక (అహ హ).
Поcмотреть все песни артиста
Other albums by the artist