Kishore Kumar Hits

Ghantadi Krishna - Rivvuna Egire Guvva lyrics

Artist: Ghantadi Krishna

album: Janaki Weds Sriram


రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వరంటా
ఈ రోజే చెప్పమంటా
నీ రాజు ఎవ్వరంటా
ఈ రోజే చెప్పమంటా

అల్లరి పిల్లకు నేడు వెయ్యాలిక మెళ్ళో తాడు
ముడివేసే సిరిగల మొనగాడు ఎవరే వాడు
చక్కని రాముడు వీడు
నీ వరసకు మొగుడవుతాడు
ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు ఈ పిరికోడు
ఆ కృష్ణుడి అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే
గోపికలే వస్తే అటే పరిగెడతాడే
ఓ గడసరి పిల్లా
నీ కడుపున కొడుకై పుడతానే
కూతురుగా పుట్టు నీ పేరే పెడతాలే
గొడవెందుకు బావతో వెళతావా
పద బావా పాలకోవా
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా
నీ రాజు ఎవ్వరంటా
ఈ రోజే చెప్పమంటా

చిటపట చినుకులు రాలి అవి చివరకు ఎటు చేరాలి
సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి
నిండుగ నదులే ఉరికి
అవి చేరును ఏ ఏ దరికి
కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి
అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి
బతుకంతా ఒకటై ఇలా జత కావాలి
మన బొమ్మల పెళ్లి నువ్వే తాళిని మెళ్ళో కడతావా
మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా
ఓ బావ ఒట్టే పెడుతున్నా
నే కూడా ఒట్టేస్తున్నా
రివ్వున ఎగిరే గువ్వా
నీ పరుగులు ఎక్కడికమ్మా
మంచున తడిసిన పువ్వా
ఈ నవ్వులు ఎవ్వరివమ్మా
నా రాజు నువ్వేనంట
ఈ రోజే తేలిసిందంట
నా రాజు నువ్వేనంట
ఈ రోజే తెలిసిందంట

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists