Kishore Kumar Hits

Balakrishna - O Prema lyrics

Artist: Balakrishna

album: Ashwamedham


ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ఇంక ఏదేమైనా రావేమైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే
ఒకమాటో అరమాటో అలవాటుగా మారేవేళ
ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా

చలువరాతి హంస మేడలో ఎండే చల్లనా
వలువచాటు అందగత్తెలో వయసే వెచ్చనా
వసంతపు తేనెతోనే తలంటులే పోయనా
వరూధినీ సోయగాల స్వరాలు నే మీటనా
నువ్వుకల్లోకొస్తే తెల్లారే కాలం
నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం
నువ్వు కవ్విస్తుంటే నవ్విందీరాగం
రెండు గుండెల్లోన తప్పిందీతాళం
మురిసింది తార మూగాకాశంలో
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా ఇంక నేనేమైనా నీకేమైన గాలేవీచి కూలే ప్రేమా తెలుసా
విధి నిన్ను ఓడిస్తుంటే వ్యధలాగే నేనున్నా
కథ మారి కాటేస్తుంటే ఒడిగట్టి పోతున్నా
ఎడబాటే ఎదపాటై చలినీడగా సాగేవేళ
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా

మనసులోన తీపి మమతలు ఎన్నో ఉంటవి
ఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా అవి
ఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగా
ఎదారిన దారిలోనే షికారులే నావిగా
కన్నె అందాలన్నీ పంపే ఆహ్వానం
కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం
స్వర్గ లోకంలోనే పెళ్లి పేరంటం
సందెమైకంలోనే పండే తాంబూలం
మెరిసింది తార ప్రేమకాశంలో
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా
ఓ మైనా ఇంక ఏదేమైనా రావేమైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా
అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే
ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే
ఒకమాటో అరమాటో అలవాటుగా మారేవేళ
ఓ ప్రేమా
నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా
ఓ మైనా
సాహిత్యం: వేటూరి

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists