Balakrishna - Gudigantalu Mroginavela lyrics
Artist:
Balakrishna
album: Vamshoddarakudu
(సాని సాని సాని సనినిప
నీస నీస నీస నిపమరి
రిమమప మరిస రిమమప మరిస
రిమమప పనినినిస)
♪
గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి పరవశించానే
హృదయమే పాన్పుగా ముందు పరిచాను
నీ ముందు పరిచాను
(సాని సాని సాని సనినిప
నీస నీస నీస నిపమరి
రిమమప మరిస రిమమప మరిస
రిమమప పనినినిస)
♪
నీ అందెల సవ్వడిలో నిగమ సారముంది
నీ చూపుల రాపిడిలో మధన తాపముంది
ఎన్నో జన్మల పుణ్యం ఎదురైనది ఈ వేళ
ఈ అరుదైన అనువైన అనుబంధం
ఇక ఏనాడూ విడిపోదు ఈ బంధం
ఇది దొరకక దొరికిన శృంగార సౌభాగ్యము
గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి పరవశించాను
♪
(తద్దిందింతన తద్దిందింతన తద్దిందింతన తద్దిందింతన)
♪
సిరి తరగని మధుసిరి నీ పరువానికి బిరుదు
నిను మించిన మదవతీ ఈ లోకంలో అరుదు
నింగీ నేలకు వంగీ నిను నను చూస్తోంది
ఈ పులకింత విలువెంతో వయ్యారమా
నీ మదిలోని వలపంత పురుషోత్తమా
ఇది కని విని ఎరుగని కైవల్య వైభోగమే
గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి నిన్ను చేరాను
హృదయమే పాన్పుగా ముందు పరిచాను
నీ ముందు పరిచాను
(సాని సాని సాని సనినిప
నీస నీస నీస నిపమరి
రిమమప మరిస రిమమప మరిస
రిమమప పనినినిస)
Поcмотреть все песни артиста
Other albums by the artist