Kishore Kumar Hits

Balakrishna - Andala Prayam lyrics

Artist: Balakrishna

album: Vamshoddarakudu


అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే
కనరాని గాయం కలిగించే తాపం నీ కొంటె చూపులకే
జతచేరి జవరాలి మదిలోగిలి
పలికింది సరసాల తొలి జావళి

అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే

పరువైనా
పరువాన
పసికూన రాగాలు నను పిలిచెనా
అనువైన సాయలు అందించనా
మృదువైన
పెదవుళ్లు
ఒనికేటి వైనాలు కనిపించెనా
మౌనాల గానాలు వినిపించినా
చిక్కని చెక్కిలి నొక్కిలిలోన ఉక్కిరి బిక్కిరిగా
కొత్తగా అద్దిన ముద్దులు నిన్ను ముంచెత్తగా

అందాల ప్రాయం కందింది పాపం
నీ కొంటె చూపులకే, కే, కే, కే

తొలిసారి
తెలిసింది
సొగసింటి తగువెంత సుఖమైనదో
పొగరాని సెగలెన్నో రగిలించెనో
చెలి వీణ
పలికింది
ముదిరేటి మునిపంట మురిపాలతో
పదునైన కొనగోటి సరిగమలతో
వెచ్చని ఊపిరి తాకెను నన్ను అల్లరి పల్లవిగా
పచ్చని ఆశలు పాకలు ఎన్నో చిగురించగా

అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే
కనరాని గాయం కలిగించే తాపం నీ కొంటె చూపులకే
హే జతచేరి జవరాలి మదిలోగిలి
పలికింది సరసాల తొలి జావళి

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists