Balakrishna - Ravaya Muddula Mama lyrics
Artist:
Balakrishna
album: Samarasimha Reddy
రావయ్యా ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చేయ్యాలమ్మా
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి అట ఆడుకుందామా
అల్లుకొని వెల్లువలో
ఝల్లుమనే కథే విందామా
రావయ్యా ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చేయ్యాలమ్మా
♪
మనసైన మాపటి లగ్గంలోన
మన పెళ్లి జరిగేను
అక్షింతలెయ్యగ వలపులు రేపు లక్షింతలయ్యేను
నిరీక్షణే ఫలియించి వివాహమే కాగా
ప్రతీ క్షణం మనకింకా
విలాసమై పోగా
కలలే నిజమై సల్లాపమే
సన్నాయిగ మోగే
హెయ్ రావయ్యా ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చేయ్యాలమ్మా
♪
విరజాజి వేలకు విందులు చేసి
విరిసింది నా ఈడూ
మరుమల్లే పూజకు తొందర చేసి
మరిగింది నీ తోడు
సుతారమై నా మేను సితారలా మోగే
ఉల్లాసమే నాలోన ఉయ్యాలలే ఊగే
ఒడిలో ఒదిగే వయ్యారమే
సయ్యాటలే కోరే
రావయ్యా ముద్దుల మావ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చేయ్యాలమ్మా
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి అట ఆడుకుందామా
అల్లుకొని వెల్లువలో
ఝల్లుమనే కథే విందామా
Поcмотреть все песни артиста
Other albums by the artist