Balakrishna - Rave Rajahamsala lyrics
Artist:
Balakrishna
album: Muddula Mogudu
ఆలపించె అణువు అణువు స్వాగతాంజలి
ఆలకించి మేలుకుంది నీ అనార్కలి
వేచివుంది వలపు లోగిలి
♪
రావే రాజహంసలా నీవే రెండు కన్నుల
నిండి ఉండిపోవే వెన్నెలా
రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా
ఓ చిలిపి కల
ఓ వలపు వల
జరపవె జతపడు లీలా
రావే రాజహంసలా నీవే రెండు కన్నుల
నిండి ఉండిపోవే వెన్నెలా
♪
అందాల సారమా మందార హారమా
నీ తేనెలో తేలించుమా
♪
గంగా సమీరమా శృంగార తీరమా
నీ లీలలో లాలించుమా
అధరసుధల మృదుహాసమా
మదికి మొదటి మధుమాసమా
మదన కథల ఇతిహాసమా
మనసుపడిన దొరవే సుమా
సదా గులామై సఖీ సలాం అను
సలీం చెలిమినే ఆదరించుమా
రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా
♪
మేఘాలచంద్రమా మోహాలమంత్రమా
నా ప్రాయమే పాలించుమా
♪
రాగాల సంద్రమా లాగేటి బంధమా
నా శ్వాసనే శాసించుమా
బ్రతుకు నడుపు అనురాగమా
మనసు తెలిసి దయచేయుమా
తలపు తెలుపుకొను మౌనమా
తెరలు తెరచి ననుజేరుమా
జగాలలో ప్రతి యుగానికీ
మన కథే నిలుచునని చాటి చూపుమా
రావే రాజహంసలా నీవే రెండు కన్నుల
నిండి ఉండిపోవే వెన్నెలా
ఓ చిలిపి కల
ఓ వలపు వల
జరపవె జతపడు లీలా
రారా రాజశేఖరా నీకే రాజధానిలా
వేచివున్న ఎదనే ఏలరా
Поcмотреть все песни артиста
Other albums by the artist