Kishore Kumar Hits

Baradwaj - O Priya (From "I Love You Da") lyrics

Artist: Baradwaj

album: Hits of Baradwaj


ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
చిరునగవుల్లో తొలకరి జల్లు కురిసే వేళలో
ప్రేమ పురాణం పల్లకి రాగం సాగే వేళలో
ఊసులుతోని ఊహల ఊయలలూపే వేళలో
చూపులతోని కమ్మని కథలు తెలిపే వేళలో
ప్రేమలో పావనితో జావళీలు పాడన
జావళీలు పాడుకోనె జాగరాలు చేయన
నీ తడిసిన పెదవిని పెడవులతో
నే ముద్దుల ముద్రే వేయన
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
తుమ్మెద నీవై రమ్మని పిలిచే కమ్మని రేయిలో
ఝుమ్మని తేనెలు తీయని వానై కురిసే వేళలో
వన్నెల పైట వెన్నెలలోన జారే వేళలో
వెచ్చని ప్రాయం నెచ్చెలి సాయం కోరే వేళలో
నిన్ను చూసి చూడంగానే చెప్పలేని హాయిలో
గుండెచాటు కోరికలన్నీ గుప్పుమన్న వేళలో
తడబడు అడుగుల సవ్వడిలో నీ జంటై నేనుంటాలే
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists