అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అమ్మవి ముద్దుల గుమ్మవి ఆ ముగుర మూల పుటమ్మువులే జన్మకు జన్మవి కర్మకు కర్తవి కారుణ్యాలయ కావగదే ♪ మట్టి కడుపున పుట్టిన సీతను మహారాణిగా చేసావే పుట్ట మట్టిలో పుట్టిన గాధను రామ పురాణం చేసావే పాతాళంలో కుంగుతున్న మా పాపను కావగ రావే మాతా శిశువుల సంగమానికి మాతా కదలి రావే మాతా కదలి రావే మమతల మానిని మధు సౌధామిని చల్లని నీ దయ చల్ల గదే మొర వినవే కడుపేడ్చిన కన్నుల తల్లికి తల్లివి నీవు గదే ♪ పిండి బొమ్మకు ప్రాణం పోసిన నిండు గౌరివి నీవైతే ప్రాణమున్న మా ఇంటి బొమ్మకు ఆయువు తీస్తావా జగన్మాతవై విశ్వ కుటుంబం చక్కదిద్దునది నీవైతే కన్న మాతకే కడుపుకోతగా కత్తిని ఝలిపిస్తావా
పశుపక్ష్యాదులనేలే తల్లివి శిశు హత్యను జరిపిస్తావా ఏ పాపం ఎరుగని పాపల ప్రాణం నీవే తీస్తావా ♪ శక్తి పూజకు రక్త దీపము వెలిగిస్తున్నాం చూడు ఆత్మ బలులతో హారతి పట్టి ఆరాధిస్తాం నేడు
కాటు వేయకే కాళికా కాల నాగులా మారక కన్న తల్లివా నీవిక కన్ను పోటు నీ వేడుక అమృత మూర్తివి నీవైతే అమ్మలాగ మము ఆదుకో స్వర్వ మంగళము నీవైతే మా చంటిపాపనే చేదుకో ♪ శంకరి నట కింకరి అభయంకరి కరుణాకరి సుందరి భవ సుందరి పరమేశ్వరి శుకపంజరి శంకరి శివ శంకరి పాహిమాం శంకరి శివ శంకరి దేహిమాం