ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు ఏ తీరం చేరేనో తెలియని వయసు మనసే విరిసింది పువ్వులా మౌనం చెదిరిందిలే ఇలా బహుశా ఇది చెలిమో, తొలి వరమో ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు ఏ తీరం చేరేనో తెలియని వయసు ఈ చిరు గాలులో నీ సంతకముంది ఎగసే ప్రతి అలలో నీ అలికిడి ఉంది తడిసిన నీ పాదాల అడుగుల జాడలో ముడిపడిన జత ఎదో అగుపడుతున్నదిలే ఈ కొండ కోన ఓయ్ అని పలికింది నేడు ఆమని బహుశా ఇది ప్రేమకు మొదలేమో ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు ఏ తీరం చేరేనో తెలియని వయసు కనిపించిన క్షణమే కనులను ఒక మెరుపు ఒకరికి ఒకరేదో అవ్వాలని తలపు చిరునవ్వే కోరుకొనే మురిపెము నీదని అరచేతి గీతలుగా కలసిన మనసులని నీలాల నింగి చల్లని నీ పైన చందనాలని బహుశా ఇది ప్రేమకు ఋజువేమో ఏ బంధం కలిపిందో ఎవరికి తెలుసు ఏ తీరం చేరేనో తెలియని వయసు మనసే విరిసింది పువ్వులా మౌనం చెదిరిందిలే ఇలా బహుశా ఇది చెలిమో, తొలి వరమో