అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా
అంతలోనె తెలవారిపోయెనమ్మా...
ఆ కన్నె కలువ కల కరిగిపోయెనమ్మా...
పచ్చని జంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిదీ
పచ్చని జంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిదీ
కధ మొదలవగానే కాలం కత్తులుదూసిందీ
కధ మొదలవగానే కాలం కత్తులుదూసిందీ
ఓ... ఓఓ, ఓ... ఓఓ, ఓ... ఓఓఓ
ఓ... ఓఓ, ఓ... ఓఓ, ఓ... ఓఓఓ
అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా
ఆశలెన్నొ విరిసేలా బాసలెన్నొ చేశాడు
ఉన్నపాటుగా కన్నుమరుగయే చలువ చంద్రుడూ
ఆశలెన్నొ విరిసేలా బాసలెన్నొ చేశాడు
ఉన్నపాటుగా కన్నుమరుగయే చలువ చంద్రుడూ
రేరాజును రాహువు మింగాడో అమవాస్యకు ఆహుతి అయ్యాడో
రేరాజును రాహువు మింగాడో అమవాస్యకు ఆహుతి అయ్యాడో
అటు ఇటూ వెతుకుతూ నిలువునా రగులుతూ
వెన్నెల ఉండని వేకువ వద్దని కలువ జన్మ వడలిపోయెనమ్మా
ఓ ఓ ఓ ఓ ఓ
ఓ... ఓఓ, ఓ... ఓఓ, ఓ... ఓఓఓ
ఓ... ఓఓ, ఓ... ఓఓ, ఓ... ఓఓఓ
అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా
గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో
చిక్కుకున్న ఈ చిన్న ఆశకీ శ్వాస ఆడదే
దిక్కులన్ని చూస్తున్నా నింగిని నిలదీస్తున్నా
దిక్కులేని ఈ దిగులు ప్రశ్నకీ బదులు దొరకదే
చిరునవ్వులు పూసిన మంట ఇదీ కన్నీటిని కోరని కోత ఇదీ...
చిరునవ్వులు పూసిన మంట ఇదీ కన్నీటిని కోరని కోత ఇదీ...
ఓటమై ముగెసెనా గెలుపుగా మిగిలెనా
జాబిలి వెన్నెల మాటునరేగినా జ్వాలలాంటి వింతబ్రతుకు నాది
ఆ ఆ ఆ ఆ ఆ
ఓ... ఓఓ, ఓ... ఓఓ, ఓ... ఓఓఓ
ఓ... ఓఓ, ఓ... ఓఓ, ఓ... ఓఓఓ
కలువని చంద్రుడిని ఎందుకు కలిపాడు
ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు
ఆ కధ రాసిన దేవుడన్న వాడు
కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు
నా కధలో ఆ దేవుడు ఎంతటి దయ చూపించాడూ
అడగక ముందె ఇంతటి పెన్నిధి నాకందించాడూ
కలలే కరగని ఈ చంద్రునీ నేస్తమ్ చేశాడూ
ఎపుడూ వాడని ఈ కలువనీ చెలిగా ఇచ్చాడూ
ఓ... ఓఓ, ఓ... ఓఓ, ఓ... ఓఓఓ
ఓ... ఓఓ, ఓ... ఓఓ, ఓ... ఓఓఓ
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
Поcмотреть все песни артиста
Other albums by the artist