సూటిగా చూడకు, సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
సూటిగా చూడకు, సూదిలా నవ్వకు
నింగిలో మెరుపల్లె తాకినది నీ కల
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం అడుగేయగా
కధంతా నీవల్లే నిమిషంలో మారిందంటా
బంతిపువ్వల్లే నా చూపే విచ్చిందంటా
సూటిగా చూడకు, సూదిలా నవ్వకు
సీతా కళ్యాణ వైభోగమే
రామా కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
లక్ష్మీ కళ్యాణ వైభోగమే (వైభోగమే)
గంటలో మొదలైంది కాదు ఈ భావన
గతజన్మలో కదిలిందో ఏమో మనమధ్యన
ఉండుండి నా గుండెల్లో ఈ అదురేమిటో
ఇందాకిలా ఉందా మరి ఇపుడెందుకో
నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి
సూటిగా చూడకు, సూదిలా నవ్వకు
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
Поcмотреть все песни артиста
Other albums by the artist