Pawan Kalyan - Bapu Gari Bommo lyrics
Artist:
Pawan Kalyan
album: Attarrintiki Daaredi
హేయ్' బొంగరాలంటి కళ్ళు తిప్పిందీ
ఉంగరాలున్న జుట్టు తిప్పిందీ
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ
అమ్మో బాపుగారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
రబ్బరుగాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసిందీ
అమ్మో దాని చూపు Gum'ఓ
ఓలమ్మో Old Monk Rum'ఓ 'హై
పగడాల పెదవుల్తో పడగొట్టింది
పిల్లా కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా ఎదపైనే నర్తించింది
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది
అమ్మో బాపుగారి బొమ్మో 'హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో 'హో హో
♪
మొన్న మేడమీద బట్టలారేస్తూ
కూనిరాగమేదో తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫీగ్లాసు చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా 'హోయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసిందీ
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుందీ
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసిందీ
చీరచెంగు చివరంచుల్లో నన్నే బంధీ చేసిందీ
పొద్దుపొద్దున్నే హల్లో అంటుందీ
పొద్దుపోతే చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోందీ
అమ్మో బాపుగారి బొమ్మో 'హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
♪
सैयाँ आयी आयिए
माहिए आयी आयिए
रहिए आयी आयिए
అహ అహ అహ అహ
सैयाँ आयी आयिए
माहिए आयी आयिए
रहिए आयी आयिए
అహ అహ అహ అహ
♪
ఏ మాయాలోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగిందీ
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపుగాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించిందీ
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన అందాల పోరి
పూసల దండలో నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ
అమ్మో బాపుగారి బొమ్మో 'హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో 'ఓ
Поcмотреть все песни артиста
Other albums by the artist