అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే
♪
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే
♪
వినువీధిలో ఉండే సూర్యదేవుడునే
ఇల మీద ఒదిగినాడే
కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు
శిశిపాలుడోచ్చినాడే
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే
(అతడేమి అందగాడే)
పోరాట భూమినే పూదోట కోనగా
పులకింప జేసినాడే
(పులకింప జేసినాడే)
♪
కల్యారి మలమేలు కలికి ముత్యపు రాయి
కన్న బిడ్డతడు లేడే
నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి
ఓడిలోన చేరినాడే
ఇరుకైన గుండెల్లో అనురాగమొలకగా
ఇలబాలుడొచ్చినాడే
ముక్కారు కాలమ్ము పుట్టాడు పూజకై
పుష్పమై తోడు నాకై
♪
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే
(అతడేమి అందగాడే)
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే
(వచ్చె వలపంటివాడే)
అపరంజి మదనుడే అనువైన సఖుడులే
అతడేమి అందగాడే
(అతడేమి అందగాడే)
వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై
వచ్చె వలపంటివాడే
(వచ్చె వలపంటివాడే)
Поcмотреть все песни артиста
Other albums by the artist