Kishore Kumar Hits

Anurag Kulkarni - Roju (From "Ustaad") lyrics

Artist: Anurag Kulkarni

album: Roju (From "Ustaad")


రోజూ నడిచిన చోటే
ఈ రోజేం జరిగినదో
రోజూ పలికిన బాషే
ఈ రోజేం తెలిపినదో
రోజూ తాకే చెయ్యేగానీ
ఈ రోజేం చేసిందో
రోజూ చూసే చూపేగానీ
ఈ రోజేం చూపిందో
రెండు దేహాలై కనిపించే
ఓ ప్రాణమిదేనా
మునుగుతుందా ప్రేమలలోనా
దారే గోదారై పొంగేనా
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజూ నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న
నాదాక చేరునా
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజూ నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న
ఈ రోజేదో మాయ
కన్నుల్లోనా గుండెల్లోనా లోలోతుల్లోనా

ముందు రోజు కంటె నేను
నేడు కొంత తేలికయితిని
నువ్విలా చిరునవ్వులా నాకంట పడుతుంటే
ముందు రోజు కంటె నేను
నేడు కొంత ఎర్రగైతిని
నువ్విలాగ నీడలాగ
వెంట వెంట వెంట పడుతుంటే
ఏ రోజున చూడని చిలిపి మలుపులు
ఈ దారికి ఇక్కడ ఇప్పుడు మొలిచినవి
సాయంకాలాలన్నీ ఇంత సాయం చేస్తాయనుకోలేదు
ఉదయాలే ఎన్ని ఉల్లాసాల్లో తేలుస్తున్నాయే
నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
రోజూ రోజూ కలని కలిసినదే
నీవల్లే నీవల్లే ఈ జన్మే ఇల్లానే
రోజూ రోజూ కలని కలిసినదే
ఏ వైపునా నీతో ఉన్నా
ఆ వైపున వెలుగుల వాన
రోజు నువ్వు నాతో ఉన్నా
లేదే ఇది నిన్నా మొన్నా
చుట్టూ నలుగురికేమౌతున్న నాదాక చేరునా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists